సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు జవ్వాది గణేశ్వర కుమార్ తన అనుచరులు 300 మందితో భీమవరం మండలం గుట్లపాడు గ్రామము నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం టిడిపిలో చేరినట్లు భీమవరం టీడీపీ కార్యాలయం ప్రకటించింది. నేడు, బుధవారం భీమవరం మండల టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ వారికి టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జవ్వాది గణేష్ తండ్రి, త్రిమూర్తులు తెలుగుదేశంపార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని గణేష్ మరియు వారి అనుచరులు పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ రానున్న స్థానిక సంస్థల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెలిపారు.ఏపీఐఐసీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర శ్రమను గమనిస్తూ అనేకమంది యువ నాయకులు టిడిపిలో చేరుతున్నారని పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. గణేష్ తన తండ్రి త్రిమూర్తులు వలె రాజకీయాలలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతూ క్రమశిక్షణతో పార్టీకి అంకితభావంతో పనిచేయాలని అన్నారు. .ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నేతలు భీమవరం మండల గ్రామాల టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *