సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని పశ్చిమగోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నందు డ్రైవర్లుగా విధులు నిర్వర్తించుటకు ఓపెన్ కేటగిరీ కింద రెండు (02) డ్రైవర్ పోస్టుల (పురుషులు) భర్తీకి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశానుసారం దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.ఈ పోస్టులకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారై, 10వ తరగతి ఉత్తీర్ణత మరియు మోటార్ వెహికల్ లైట్ లైసెన్స్ (LMV) కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 జనవరి 28 మరియు 29వ తేదీలలో గొల్లలకోడేరు నందలి జిల్లా పోలీస్ కార్యాలయంలోని RI (MTO) గారికి స్వయంగా సమర్పించాలి.
