సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కార్యాలయంలో నేడు, ఆదివారం కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే నాచు వెంకట్రామయ్య గారి 110 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు పుష్ప మాలలు వేసి ఆయన సేవలకు ఘన నివాళ్లు అర్పించారు. భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా విశేష కృషి చేసారని అంతేకాదు భీమవరం గ్రామపంచాయితీ స్థాయి నుండి మున్సిపాలిటీగా మార్పు చెయ్యడానికి ఆ మహనీయుని కృషి ఎంతగానో ఉందని వక్తలు పేర్కొన్నారు. ..అలాగే భీమవరం లో 1895 లో జన్మించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు గారి వర్ధంతి సందర్భముగా నేడు, ఆదివారం పలువురు ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చిత్రకారుడు, నవల రచయితా,, స్వతంత్ర సమర యోధుడు . పత్రికా సంపాదకుడు, సినిమా నిర్మాత, పాటల రచయిత గా అడవి బాపిరాజు ఎందరికో ఆదర్శం.. ప్రస్తుతం ఆయన మనవడు అడవి శేషు సినిమా హీరోగా రాణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *