సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆకివీడులో అతి పురాతన రామాలయం పునర్ నిర్మించే అంశంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ , స్థానిక ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆ ప్రాంతానికి వెళ్ళటంఅక్కడ కొందరు క్రైస్తవులు రామాలయ నిర్మాణానికి అడ్డు తగలడం చేసుకొందాం లే .. అన్న స్థాయిలో ఉద్రిక్తలు చోటుచేసుకోవడం తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు నేతలు భీమవరం శివారులోని రఘురామా ఇంటిని ముట్టడించాలని పిలునివ్వడం నేపథ్యంలో నేడు, శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల కొంత మంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై చేస్తున్న అసత్య ప్రచారంను ఖండిస్తున్నా అన్నారు. ఆకివీడు రామాలయం 100 ఏళ్ళనాటిదని అక్కడ సీతారామానులను పట్టించుకోవే రఘురామా అంటూ ‘సాక్షి’ దిన పత్రికలో పూర్తీ వివరాలతో వచ్చిన వార్తను చూసి నేను దానిపై ఒక టీమ్ ను పంపితే అక్కడ స్థానికులు అడ్డుకోవడంతో స్వయంగా తనే వెళ్లానని పురాతన గుడి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానని దీనిపై రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని పిలుపు నిచ్చారు. నిజానికి పలు చోట్ల రామాలయాలు ఉన్న చోట క్రైస్తవ చర్చలు నిర్మించడం లేదా?పురాతన గుడి ని 65 లక్షలతో మరల నిర్మిస్తే తప్పేమిటి? భీమవరం మావుళ్ళమ్మ గుడిని స్థానికులు మాత్రమే సందర్శిస్తారా ? బయటి ప్రాంతాలవారు వస్తారు. అలానే ఆకివీడు రామాలయం మంచి స్థపతి చేత నిర్మిస్తామని అందరు దర్శించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. నా వైఖరిని కొందరు నిజాలు తెలుసుకోకుండా విమర్శిస్తున్నారని వారిని హెచ్చరిస్తున్నానని రఘురామా అన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *