సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలలో భాగంగా నేడు, గురువారం అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం, నిర్వహిస్తున్నవేళ శ్రీ అమ్మవారి నగరోత్సవం నేపథ్యంలో నేడు, విశాఖపట్టణం కి చెందిన హేమలత మరియు ఇతర భక్తబృందం సభ్యులు(30 మహిళలు)శ్రీ అమ్మవారికి జేష్ఠమాస సారె ను అందిస్తూ వాటిలో ప్రత్యేకంగా తయారు చేయించిన పూల దండలు, గాజులు పసుపుతో అలంకరించిన పాదాలు వివిధ రకాల పళ్ళు, స్వీట్స్ సమర్పించి అనంతరం లలిత సహస్రనామ పారాయణం మరియు కోలాటం కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరికి ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు, వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు అందచేసినారు
