సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 14వ వార్డులో ‘ మినిషిర్ది’ గా ప్రసిద్ధి పొందిన సాయిబాబా ధ్యాన మందిరంలో 30 వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు, శనివారం ఉదయం శ్రీ బాబావారికి 22 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు తదుపరి అన్నం తో కూడా అభిషేకం నిర్వహించారు. 2న్నర దశాబ్దాలు క్రితమే జిల్లాలో ప్రప్రధమంగా ఇక్కడి నుండే బాబా వారికీ అన్నాభిషేకం అనే పక్రియ ప్రారంభం అయ్యింది. బాబావారి అన్నాభిషేకం ముగిసాక మందిరం ఆవరణలో శ్రీ సాయి సస్సంగ సేవాశ్రయయం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశేషంగా వచ్చిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
