సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా నడిచే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నింటికి సంక్రాంతి సందడి ప్రభావం ఇప్పటి నుండే మొదలయింది.భీమవరం మీదుగా వెళ్లే రైళ్లు అన్ని జనవరి 9వ తేదీ నుంచే అన్ని క్లాసుల్లోనూ భారీ వెయిటింగ్ లిస్టు చూపిస్తోంది. ఇక ఈ వారంలో క్రిస్మస్ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని పురస్కరించుకుని ఈ నెల 22 , 25 తేదీలలో సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్‌లకు నరసాపురం నుంచి ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు భీమవరం రైల్వే అధికారులు తెలిపారు. 07466 నంబర్‌తో ఈ నెల 22న నరసాపురం నుంచి సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌కు బయలుదేరే స్పెషల్ ట్రైన్ పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, గుంటూరు, నల్గొండ మీదుగా మరుసటిరోజు ఉదయం 4.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు రాత్రి 23న 07439 నంబర్‌తో సికింద్రాబాద్‌లో రాత్రి 8.35కి బయలుదేరి మర్నాడు ఉదయం పది గంటలకు నరసాపురం వస్తుంది.నరసాపురం నుంచి యశ్వంత్‌పూర్‌కు ఈ నెల 25న 07687 నంబర్‌తో మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి గుంటూరు నంద్యాల, అనంతపురం, ధర్మవరం మీదుగా మర్నాడు ఉదయం 10.50కి యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరిగి అదే రోజు సోమవారం 07688 నంబర్‌తో మధ్యాహ్నం 3.50కి యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు నరసాపురం వస్తుంది.
