సిగ్మాతెలుగు డాట్, న్యూస్: కోస్టల్ ఆంధ్రాలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ మరో విజయవాడ స్థాయి నగరంగా మారుతున్నాభీమవరం మీదుగా డైరెక్ట్ గా చెన్నాయి వెళ్లే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు కు ఇక్కడ ప్రయాణికులతో దశాబ్దాల అనుబంధం ఉంది. అయితే అది కాకినాడ నుండి బయలు దేరుతుంది. అయితే సుదీర్ఘ కాలంగా ఈ డెల్టా ప్రాంత, కోనసీమ ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా నరసాపురం నుంచి చెన్నైకు భీమవరం మీదుగా కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి సదరన్ రైల్వేకు పంపింది. ఆమోదం రాగానే నరసాపురం నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక రైళ్లు నడిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఈ రైలు నెలాఖరు నుంచే ఇది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు నరసాపురం నుంచి భీమవరం, విజయవాడ, గూడూరు మీదుగా వెళ్లే చెన్నైకు ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై ఉదయం ఎనిమిది గంటలకు చేరుతుంది. తిరిగి ఆక్కడ సోమ వారం సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు నరసాపురం చేరనుంది. దీనికి ప్రయాణికుల డిమాండ్ బాగాఉంటే కంటిన్యూ వెళ్లే విధంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భీమవరం మీదుగా డబ్లింగ్ లైన్ పూర్తయి ఏడాది పైగా కాలం గడిస్తున్న కొత్త రైళ్లు వెయ్యడానికి రైల్వే శాఖ ఎందుకో మీనమేషాలు లెక్కపెడుతుంది. గతంలో ప్రకటించిన ఎన్నో రైళ్లు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఇక మొదలవుతుంది అనుకున్న నరసాపురం–వారణాశి (కాశీ ) ఎక్స్‌ప్రెస్ ఇంకా పట్టాలెక్కలేదు. విరామాలు అనంతరం కొద్ది రోజుల నుంచి హైదరాబాద్, బెంగళూరుకు మాత్రం వారంలో రెండు, మూడు రోజులు ప్రత్యేక రైళ్లు నడుపుతూ వస్తున్నారు.
