సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి 2వ తేదీ ఆదివారం నుండి అన్ని విద్యాసంస్థలకు, కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కావడంతో దసరా ప్రయాణికుల సౌకర్యం కోసం నరసాపురం-యశ్వంత్‌పూర్‌ల మధ్య 2, 3 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 07153 నెంబర్‌తో నరసాపురంలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి భీమవరం టౌన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మరుసటి రోజు ఉదయం 10.50కు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 07154 నెంబర్‌తో సాయంత్రం 3.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు నరసాపురం వస్తుంది. పాలకొల్లు, భీమవరం టౌన్, అకివీడు, గుంటూరు, నంద్యాల, ధర్మవరం, అనంతపురం, హిందూపురం మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి అని ప్రకటించారు.
