సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు ( భీమవరం జంక్షన్, టౌన్ స్టేషన్స్ మీదుగా )నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటిం చారు. నర్సాపూర్–బెంగళూరు ప్రత్యేక రైలు (07153) మే 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపురం నుండి బయలుదేరి, భీమవరం మీదుగా మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు (07154) మే 6 నుండీ 27 వరకు ప్రతి శనివారం ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం , భీమవరం ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కృష్ణార్జునపూరం స్టేషన్లలో ఆగుతూ వెళుతుంది,
