సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మనేడు, శుక్రవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు గతిశక్తి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ జైన్ తో ఆయన విడివిడిగా భేటీ అయ్యి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. రైల్వే జీఎం శ్రీవాస్తవ కు కీలక ప్రతిపాదనలు చేశారు. భీమవరం మీదుగా.. నరసాపురం – విశాఖపట్నం మధ్య కొత్త ఇంటర్సిటీ రైలు లేదా పాసెంజర్ రైలు సేవలను తక్షణమే ప్రారంభించాలని,. నరసాపురం నుండి విశాఖపట్నంకి నేరుగా ఎక్స్ప్రెస్ రైళ్ల సదుపాయం లేదని ఆయన అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా నరసాపురం నుండి బెంగళూరుకు ‘అమృత్ భారత్’ స్లీపర్ రైలు, కాశీ పుణ్యక్షేత్రానికి నేరుగా రైలు సౌకర్యం, నరసాపురం నుండి హైదరాబాద్ – బెంగళూరుకు ఆధునిక వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని జీఎంకు విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న నరసాపురం – అరుణాచలం వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తూ, వారంలో మరిన్ని రోజులు నడిపే విధంగా ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరగా అందుకు అధికారులు సానుకూలంగా త్వరలోనే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. నర్సాపురం నుండి రాజమండ్రికి MEMU సర్వీసులను తిరిగి ప్రారంభించాలని కోరారు. తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు తాడేపల్లిగూడెంలో నిలుపుదల కోరారు..
