సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ నేటి సోమవారం తో ముగియడంతో రేపటి నుండి తిరుగు ప్రయాణాలు చేసే బందు మిత్రులకు రద్దీ దృష్ట్యా భీమవరం మీదుగా నరసాపురం నుంచి యశ్వంత్పూర్ కి( బెంగుళూర్ వైపు) రేపటి నుండి 18, 19, 20, 21 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రేపు 18న నరసాపురంలో మధ్యాహ్నం 3.10 గంటలకు భీమవరం 3.35 కి చేరుకొంటుంది. ఇక్కడి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ చేరుతుందన్నారు. తిరిగి అదేరోజు అక్కడ మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. 20న నరసాపురంలో మధ్యా హ్నం 2.20గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30గంటలకు యశ్వంత్పూర్ చేరుతుందన్నారు. అదేరోజు సాయం త్రం 5.20 గంటలకు అక్కడ బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30గంటలకు నరసాపురం చేరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *