సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాదిన పవిత్ర గంగా పుష్కరాలను పురస్క రించుకుని కాశీ, అలహాబాద్‌ వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు, వారణాసి( కాశీ )ల మధ్య భీమవరం మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈనెల 22, 29, మే 9న ఈ స్పెషల్‌ రైళ్లు ను ఏర్పాటు చేసారు. విజయవాడ నుండి భీమవరం మీదుగా విశాఖ, దువ్వాడ, విజయనగరం, రూర్కెలా, రాంచీ మీదుగా ఈ రైలు వారణాసి వెళుతుంది ఈ రైలు వారణాసి వెళుతుంది. ఈ రైల్ పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, తణుకు, నిడదవోలు స్టేషన్లలో ఆగుతుంది. గుంటూరులో రాత్రి 23.48కి బయలుదేరి భీమవరం 3.10 గంటలకు చేరు కుంటుంది. తణుకు 4, నిడదవోలు 4.30 గంటలకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో బెనారస్‌ నుంచి ఈనెల 24, మే 1, 8 తేదీల్లో ఈ స్పెషల్‌ రైళ్లు నడవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *