సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైల్వే ట్రాక్, లైట్స్ ఇతర ఆధునీకరణ నిర్వహణ పనులు కారణంగా గత పది రోజులుగా డెమో రైళ్లు రద్దు కావడంతో భీమవరం, నరసాపురం, పాలకొల్లు ప్రయాణికులు ఉదయం పూట విజయవాడ వైపు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగర్ సోల్ ఒక్కటే దిక్కుగా ఉండేది. ఉదయం పూట ఎప్పుడు ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించే భీమవరం జంక్షన్, టౌన్ రైల్వే స్టేషన్స్ ఉదయం పుట కళ తప్పాయి. అయితే ఇటీవల రద్దయిన డెమో రైళ్లు నేటి సోమవారం నుంచి మరల పట్టాలు ఎక్కాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతున్నారు. అయితే ఉదయం గుంటూరు వెళ్లే పాస్ట్ ప్యాసింజర్‌కు మాత్రం ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఈ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 31 నుంచి తిరిగి బయలు దేరే అవకాశం ఉంది. ఇటు నరసాపురం నుంచి ఉదయం 9.45 కు బయలు దేరి భీమవరం మీదుగా విజయవాడ, మధ్యాహ్నం 2.45కి వెళ్లే గుంటూరు, 3.05కి వెళ్లే విజయవాడ, రాత్రి 8.10కి వెళ్లే నిడదవోలు, రాత్రి 11.10కి వెళ్లే భీమవరం డెమా రైళ్లు గతంలో మాదిరిగా యధావిధిగా నడవనున్నాయి.
