సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ నుండి బయలుదేరి భీమవరం మీదుగా నడిచే కాకినాడ– చెన్నై సర్కార్‌ ఎక్స్‌ప్రెక్స్‌ పాండిచ్చేరి వరకు పొడిగించారు. ప్రస్తుతం వారంలో మూడు రోజులు మాత్రమే నడుస్తోంది. ఆది కూడా ఆది, బుధ, గురువారాల్లో, తిరుగు ప్రయాణాల్లో సోమ, గురు, శుక్రవారాల్లో పాండిచ్చేరి నుంచి కాకినాడ వరకు నడుస్తోంది. ఇక మిగిలిన నాలుగు రోజులు యాధావిధిగా కాకినాడ పోర్టు నుంచి చెంగల్‌పట్టు స్టేషన్ వరకు నడుస్తోంది. ఈ ఏడాది జూలై వరకు ఈ రైలును వారానికి మూడు రోజులు నడప నున్నారు. ఆ తరువాత వారంలో అన్ని రోజులు నడుస్తోంది. ఈరైలు పాండిచ్చేరికి ఉదయం 9.50గంటలకు చేరుకుంటుంది. తిరిగి పాండిచ్చేరిలో మధ్యాహ్నం 1.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం భీమవరం 4.40, తణుకు 5.13కి చేరుకొంటుంది. సుదీర్ఘ కాలంగా సుమారు 5 దశాబ్దాలు పైగా నెడుతున్న ఈ సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలకు అందుబాటులో తణుకు, అత్తిలి, భీమవరం, ఆకివీడు స్టేషన్స్ లో హోల్డ్ అయ్యి అటుగా చెన్నై వెళుతుంది.ఎన్నో ఏళ్లుగా పాండిచ్చేరి వరకు రైలు పొడిగించమని ఈ ప్రాంత ప్రజలు, కాకినాడ వద్ద పాండిచ్చేరి ప్రభుత్వ పాలన లో ఉన్న యానాం ప్రజలు చేస్తున్న విజ్ఞప్తుల మేరకు ఇంతకాలానికి సదరన్‌ రైల్వే ఆమోదం తెలిపింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *