సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ మీడియా తో నరసాపురం పార్లమెంట్ పరిధిలో చేపట్టనున్న రైల్వే అభివృద్ధి పనులపై మాట్లాడుతూ.. నరసాపురం–మచిలీపట్నం మధ్య చేపట్టే కొత్త రైల్వేలైన్ పనులకు డీపీఆర్ సిద్ధమైందని, రానున్న కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలను మరింత దగ్గర చేసే నరసాపురం– కోటి పల్లి రైల్వేలైన్ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వడం లో ఆలస్యం , భూసేకరణనే కారణమన్నారు. ఈ బడ్జెట్‌లో అదనపు కేంద్ర నిధులతో ఈ పనులు సాకారం చేస్తామన్నారు. ఇక ఎంతో కాలంగా అనేక అడ్డంకులు ఎదురు అవుతున్న నరసాపురం నుండి భీమవరం మీదుగా వారణాశిల ( కాశీ )మధ్య కొత్త రైలు, మరియు నరసాపురం–సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ రైలు మరియు అతి త్వరలో భీమవరం నుండి చెన్నైల మధ్య వందేభారత్‌ను ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నిర్మించే 165 జాతీయ రహదారికి ఐదు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాధించారన్నారు. వీటితో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించే ఆర్వోవి వంతెన నిర్మాణాల ఖర్చు, తదితర ప్రతిపాదనలు పూర్తికా గానే ఈ పనులకు కేంద్ర నిధులు విడుదల అవుతాయన్నారు.
