సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, మంగళవారం ఉదయం మున్సిపల్ సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పట్టణంలో టౌన్ ప్లానింగ్ , రెవెన్యూ, సర్వే అధికారులపై అవినీతికి సంబంధించి చాల పిర్యాదులు అందాయని పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారి సామాన్యుల వద్ద్ద చిన్న చిన్న గది నిర్మాణాలకు కూడా జాలి దయ లేకుండా 25 వేలు లంచం గుంజుతున్నారని, ఇదే కొనసాగితే, మీరు ఏసీబీ కి దొరికిపోతారని యిప్పటికే నిఘా ఉందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచాలని, నిధులను అందించే బాధ్యత మాది అని, నిధులు లేవని పనులు ఆపవద్దని , త్వరితిగతిన పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం చేయాల్సిన 81 పనులను కూడా పూర్తి చేయాలని, చాలా చోట్ల మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ లోటు లేకుండా చూడాలని, తాగునీటి సమస్య, పారిశుధ్య సమస్యలు, వీధి కుక్కల బెడద, లేకుండా చూడాలని అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. భీమవరంలో పనిచేస్తున్న మునిసిపల్ అధికారులు అదృష్టవంతులని ప్రతి అధికారిని ఇక్కడ ప్రజలు గౌరవించి ఆదరిస్తారని, ప్రజల నుంచి పిర్యాదులు వస్తే 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించేలా సమస్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి , ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, లకు సూచించారు. స్థానిక కాంట్రాక్టర్స్ సభకు హాజరు అయ్యి తాము చేస్తున్న పనులకు అసలు బిల్లులు రావడం లేదని కొత్త పనులు ఎలా చేపట్టాలని ? ఎమ్మెల్యే ముందు వాపోయారు. మా ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులకు నాది హామీ అన్నారు ఎమ్మెల్యే అంజిబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *