సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయం లో రీజనల్ డైరెక్టర్ కమ్ రాజమహేంద్రవరం వారు పురపాలకు సంఘ విభాగాల అధిపతులు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నందు ఆస్తిపన్ను వసూలు మరియు నీటి పన్ను వసూలు పట్టణంలోని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ మరియు పట్టణ పరిధిలోని షాపుల నుండి వసూలు చేసే D& O ట్రేడు లైసెన్స్ ఫీజు వసూళ్ల పై సమీక్షా సమావేశం నిర్వహించి. పట్టణంలో పారిశుధ్య పురోగతిపై సమీక్ష నిర్వహించి పట్టణంలో తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించి వాటిని 100% ప్రాసెస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.ప్రజల నుండి వచ్చే PGRS మరియు ‘పురమిత్ర’ ఫిర్యాదులను సకాలంలో సరైన పద్ధతులు పరిష్కరించవలసిందిగా సిబ్బంది ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి , అసిస్టెంట్ కమిషనర్ A. రాంబాబు మరియు మున్సిపల్ ఇంజనీరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు
