సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు నిత్యా జీవితంలో మునిసిపల్ పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంత చెప్పిన తక్కువే.. వారికీ అందరు రుణపడి ఉండాలి. నేడు, మంగళవారం ఉదయం భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు పురపాలక సంఘ ప్రజారోగ్య విభాగం నందు పని చేయు రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య వర్కర్లకు మరియు నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు పురపాలక కమిషనర్ కె రామచంద్రారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలుతో, వారి చేతుల మీదుగా వర్కర్లు పారిశుద్ధ్య పనులలో వినియోగించే సేఫ్టీ ఎక్విప్మెంట్ యాఫ్రాన్సు, కొబ్బరినూనె, సబ్బులు మరియు చేతి గ్లౌజులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆర్ సోమశేఖరం మరియు అన్ని డివిజన్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *