సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి భీమవరం నియోజవర్గం స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భీమవరంలో పట్టణంలో 10 ఎజెండా అంశాలపై వివిధ శాఖలతో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కేంద్రంగా మారి ఏడాది దాటిన భీమవరం పట్టణ అభివృద్ధి కి అధికారులు సమన్వయంతో పనిచేసి శరవేగంగా పనులు త్వరితంగా పూర్తీ చెయ్యాలని, ఏమైనా అడ్డంకులు ఉంటె తన దృష్టికి తేవాలని పనులు మాత్రం ఆలస్యం కాకూడదని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు ,జెడ్పీ సీఈఓ కే రవికుమార్ ,సిపిఓ కే శ్రీనివాసరావు ,జిల్లా వివిధ శాఖల అధికారులు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…
