సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నేడు, ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో భీమవరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసానికి రావడం అల్పాహారం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భీమవరం మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని, ఇక్కడ సరిహద్దు గ్రామాలను విలీనం చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని అన్నారు. ఇంకా ఎన్నికలు పెండింగ్ లో పలు మున్సిపాలిటీలతో సంబంధం లేకుండా భీమవరం కు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. సకాలంలో లబ్దిదారులకు టీడ్కో ఇళ్ళులు కూడా అందజేస్తామని, కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. తదుపరి అయన పాలకొల్లు బయలు దేరారు. ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు కోళ్ల నాగేశ్వరరావు, యిర్రింకి సూర్యారావు, తదితర కీలక కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *