సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజలు పురపాలక సంఘం నకు చెల్లించాల్సిన ఆస్థి పన్ను, నీటి పన్ను, ఖాళీస్థలాల పన్నులు తక్షణం చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ ఒక ప్రకటన విడుదల చేసారు. దీనిలో .. పన్ను బకాయిలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని, అవసరమైతే బకాయిదారులు కుళాయిలు తొలగించడానికి వార్డు వారీగా టీము లు కూడా ఏర్పాటు చేశామని, పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం సెలవు దినాలు అయినా రేపు, ఎల్లుండి ఆదివారం కూడా మునిసిపల్ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు అదేవిధముగా వార్డు సచివాలయంల లో కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలను కోరారు.
