సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ & శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ కె.వి. విష్ణు రాజు భీమవరం ముస్లిం బరియల్ గ్రౌండ్లో మట్టి పూడిక పనుల నిమిత్తం తన సంస్థ తరఫున నేడు, ఆదివారం మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందజేయడం జరిగింది. ఈ విరాళాన్ని ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ జనాబ్ షేక్ రబ్బానీ మరియు జనరల్ సెక్రెటరీ జనాబ్ ఎండి జలాలుద్దీన్ బాబా అందుకోవడం జరిగింది. ఇందు నిమిత్తం వారు మాట్లాడుతూ .. స్వర్గీయ డాక్టర్ బి.వి. రాజు హయాం నుండే విష్ణు విద్యా సంస్థలు సాంఘిక సేవా కార్యక్రమాల్లో ముందుంజలో ఉంటూ వస్తున్నాయని, భీమవరం ముస్లిం కమిటీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో తమవంతు సహాయాన్ని విరాళాల రూపంలో ఇస్తూ వస్తున్నారని అన్నారు. గతంలో ఉర్దూ పాఠశాల నిమిత్తం కూడా లక్ష రూపాయల విరాళం ఇచ్చి ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జె.ఏ.సి. కన్వీనర్ ముహమ్మద్ సిద్దీఖ్, ముస్లిం కమిటీ గౌరవ అధ్యక్షుడు ఎండి అల్లావుద్దీన్ నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *