సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీరామనవమి వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరంలో పలుచోట్ల నేడు, ఆదివారం అన్న సమారాధనలు జరిగాయి. ఈ క్రమంలో స్థానిక మెంటే వారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం నందు అఖండ అన్న సమారాధన ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ సమారాధన చేసారు, అయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన సీతారామచంద్రస్వామి ఆలయం నందు స్థానికుల, భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. సుమారు ఐదువేల మందికి ఈ సమారాధనలో అన్న ప్రసాదాలు అందించే ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ నాయకులు ముత్యాల రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట బోగయ్య, గ్రంధి చిన్న తాతారావు, సమతం సత్యనారాయణ, చిలకా నాగు, ఉగ్గిరాల సత్యనారాయణ, ముత్యాల రాజబాబు, ముత్యాల అంజి, పాల్గొన్నారు.
