సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భీమవరం లోని మెంటే వారి తోట లో ఇటీవల చాలా మార్పులు వస్తున్నాయి. 4 ఏళ్ళ క్రితం బై పాస్ రోడ్డు కు రైల్వే గేటు పడటం తో మొదలయిన అభివృద్ధి అంచెలు అంచెలుగా కొనసాగుతూనే ఉంది. మెంటే వారి తోటను కలుపుతూ 3 అండర్ రైల్వే టర్నల్స్ నిర్మాణం శరవేగంగా పూర్తీ అవ్వడం తో రైల్వే గేటులనుండి ట్రాఫిక్ కు విముక్తి కలిగింది. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చొరవతో ఉండి రోడ్డునుండి స్థానిక మెంటే వారి తోట మీదుగా భీమవరం 3 టౌన్ లోని కొడవల్లి రోడ్డును కలుపుతూ 2కోట్ల పైగా ఖర్చుతో బైపాస్ రోడ్డును ఆధునీకరించడంతో మెంటే వారి తోటలో ప్రధాన పీపీ రోడ్డును తలపించేలా ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి, దానితో ఇప్పుడు మెంటే వారితోట లో వండర్ కిడ్స్ స్కూల్ వద్దనుండి బై పాస్ ను కలుపుతూ సుమారు అరకిలోమీటరు మేర రోడ్డును ఆధునీకరించి వెడల్పు చెయ్యవలసిన అవసరం ఏర్పడింది, రోడ్డుకు ఇరువైపులా చెట్లను 3నెలల క్రితమే అధికారులు తొలగించారు, ఇక ఆ రోడ్డు పనులు కూడా తాజగా ప్రారంభయ్యాయి, గత 10 రోజులుగా స్థానిక ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో నిర్మించిన కట్టడాలు, కొందరు బడ్డీ కోట్టులు , బిల్డింగ్ మెట్లు కోల్పోవాల్సిన పరిసితి వచ్చింది. సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ స్తూపంతో సహా సుమారు 50 కి పైగా నిర్మాణాలు కూల్చవలసి వచ్చింది, అయిన అందరు సహకరించారు, దానితో కొట్టివేత్తలు దాదాపుగా పూర్తీ అయ్యాయి, అడ్డంకులు తొలిగాయి, కొందరు ఇంకా స్వయంగా తమ నిర్మాణాలు తొలగిస్తున్నారు, రోడ్డు పనులు కూడా ప్రారంభయ్యాయి, అతిత్వరగా మంచి క్వాలిటీతో రోడ్డు నిర్మాణం పూర్తీ అయితే భీమవరంలో ఒక ప్రధాన కీలక సెంటర్ గా మెంటేవారి తోట మారిపోతుంది, స్థానిక ప్రజలు సహకారానికి, ఇంతకాలం అబివృద్ధి నిర్మాణాలు పేరుతొ వారు పడుతున్న కష్టాలకు మంచిరోజులు రావాలని కోరుకొందాం,
