సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిన్న ఉద్యోగమైన బాధ్యతలు చేపట్టి నైపుణ్యతను పెంపొందించుకోవడం ద్వారా జీవితానికి శాశ్వత బాటలు వేసుకోవడానికి తొలిమెట్టుగా ఉంటుందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.నేడు, బుధవారం మెప్మా సంస్థ ఆధ్వర్యంలో నిపుణ సంస్థ సహకారంతో భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాలో, ఇంటర్వ్యూలు ఆయన అనంతరం అర్హులైన నిరుద్యోగులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ,జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జస్ట్ డయల్, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్సు, ఆక్సిస్ బ్యాంకుఇన్ అస్సోసియేషన్ విత్ నిట్, పేటీఎం, ఎల్&టీ, మెడ్ ప్లస్, ప్రీమియం హెల్త్ కేర్ గ్రూప్, ది ముతూట్ గ్రూప్, అపోలో ఫార్మసీ లిమిటెడ్, భారత్ ఫైనాన్సియల్ ఇంక్లూషన్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి 16 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. మేక్ ఇండియా స్టార్ట్ అప్ కంపెనీస్, కౌసల్య యోజన ద్వారా యువతకు అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి మెప్మా పిడి జి.హెప్సిబా, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి, నిపుణ సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *