సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం నుండి పట్టణానికి అనుసంధానం గా దశాబ్దం క్రితం నిర్మించిన మూడు యనమదూరు డ్రైన్ వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలం డిమాండ్ చేశారు భీమవరం మండలం రూరల్ తోక తిప్ప గ్రామంలోనేడు, గురువారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో యనమదుర్రు డ్రైన్ వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేయాలని తోకతిప్ప వంతెనపై నిరసన తెలపడం జరిగింది. గోపాలం మాట్లాడుతూ..తోక తిప్ప, గొల్లవానితిప్ప భీమవరం DNR కాలేజీ సమీపంలో మూడు వంతేనాలు నిర్మించిన ఇప్పటికి వాటికీ అప్రూచ్ రోడ్లు వేయకపోవడం వల్ల అర్జెంటు అవసరాలు నిమిత్తం వాహనాలు ప్రజలు వంతెనలు వెంబడి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురి అవుతున్నారు అన్నారు ఇటీవల కాలంలో తోకతిప్ప గ్రామంలో ట్రాక్టర్ తో వెళుతూ తిరగబడి చనిపోయారని గుర్తు చేశారు ఎమ్మెల్యే అంజి బాబు అసెంబ్లీలో ప్రస్తవిస్తూ కేంద్రమంత్రి మరియు దృష్టిలో మూడుసార్లు చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ప్రజల పట్ల పాలకులు ఎంత శ్రద్ధ తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇంజెటి శ్రీనివాస్ రేవు రామకృష్ణ బొడ్డు లక్ష్మీపతి తిరుమణి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *