సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం – యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై 14 ఏళ్ల క్రితం 3 బ్రిడ్జిలను నిర్మాణం చేయడం జరిగిందని, వారికి అప్రోచ్ రోడ్లు వేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కోరారు. నేడు, మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో సంబందిత శాఖ మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అప్రోచ్ రోడ్ల విషయంపై ఇప్పటికే నాలుగుసార్లు మంత్రి దృష్టికి తీసుకుని రావడం జరిగిందని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తెలియజేశానని, వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేస్తే భీమవరం పట్టణానికి ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ఇప్పటికి అప్రోచ్ రోడ్లు లేక ఎప్పుడో నిర్మించిన వంతెనలు నిరుపయోగం ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తే భీమవరంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే పనులు పూర్తి చేయాలని కోరారు. గతంలో కూడా ఇదే అంశం ఫై ఎమ్మెల్యే అంజిబాబు తో పాటు ఎమ్మెల్సీ గోపిమూర్తి శాసనమండలి లో ప్రస్తావించారు. అయినా ఎందుకో.. ?
