సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ జూబ్లీ హిల్స్, రోడ్ నంబరు-52 లో భీమవరం పట్టణానికి చెందిన ఏ ఎస్ ఎన్ రాజు నివాసంలో ఈ నెల 11న ముఖానికి ముసుగు వేసుకొని దొంగ చొరబడి 6గంటల పైగా గర్భవతి అయిన రాజుగారి అమ్మాయి మెడపై కట్టి పెట్టి.. తనకు వజ్రాలు నక్లెస్ , బంగారం వద్దు .. డబ్బు కావాలని డిమాండ్ చేసి 10 లక్షలు ఇచ్చాక తాపీగా క్యాబ్ బుక్ చేసుకొని ఉడాయించిన ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది.. దానికి కొనసాగింపుగా తాజగా ఆ దోపిడీ కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 15 రోజులుగా నిందితుడి కోసం వెతుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిం చడంతో పాటు అతని వేలిముద్రలు సేకరించారు. టెక్నాలజి ఆధారంగా నిందితుడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మోతీరాం రాజేష్ యాదవ్ గా గుర్తించారు. అతడు సమీర్ పేటసమీపం లోని ఒక రిసార్ట్ లో స్నేహితులకు విందు ఇస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడు రూ.2.50 లక్షలతో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మోతీ రామ్ తన జీవితంలో తొలిసారి అయినప్పటికీ.. రాజు గారింట్లో పకడ్బందీగా దొంగతనం చేసినట్లు అతనిని పట్టుకోవడానికి , గుర్తించడానికి ఏకంగా 30 మంది పోలీసులు కృషి చేసినట్లు తెలుస్తుంది.
