సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో భీమవరం ప్రాంతానికి చెందిన ఎన్ఎస్ఎన్ రాజు, తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తె, నవ్య తో కలసి రోడ్డు నంబరు 52లో స్టెయిర్ బిల్డింగ్లో నివసిస్తున్నారు. గత శుక్రవారం తెల్లవారు జామున 4గంటలకు ఒక దొంగ నల్ల ముసుగు వేసుకొని బిల్డింగ్ ఫై అంతస్తులో నిద్రిస్తున్న రాజుగారి కుమార్తె నవ్య గదిలోకి వెళ్లి ఆమె మెడపై కత్తి పెట్టి నాకు 20 లక్షలు కావాలి అని బెదిరించాడు. ఆమె భయపడి తన వంటిపై ఉన్నబంగారం, వజ్రాల నగలు ఇస్తానని అంటే.. దొంగ మాత్రం ‘నాకు బంగారం వద్దు.. డబ్బులే కావాలి..’ అంటూ డిమాండ్ చేసారు. చివరకు ఆమె తల్లితండ్రులు పైకి వచ్చి పరిస్థితి గమనించి, దొంగ డిమాండ్ విని 10 లక్షలు ఇవ్వగా అతడు ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఉదయం 10-30 కి దానిలో పరారయ్యాడు. మొత్తానికి దొంగ ఏకంగా 7 గంటలకు పైగా రాజుగారి ఇంట్లో ఉండటమే కాకుండా, రూ.10లక్షలతో ఉడాయించిన ఘటన ఫై స్థానిక పోలీసులకు ఉదయం 11-30 కి పిర్యాదు అందటం.. వారు కేసు దర్యాప్తు ప్రారంభించడంతో నేడు, శనివారం ఈ తమాషా దొంగ ఘటన వెలుగులోకి వచ్చింది
