సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజలకు గత దశాబ్ద కాలంగా ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ మరోసారి కొత్త ఏడాది, పండుగల కోలాహలంతో స్థానిక నటరాజ్ థియేటర్ ప్రక్కన ప్రారంభించారు. సుమారు 2 నెలలుగా భీమవరం ప్రజలకు చేతి వృత్తి కళాకారుల ప్రదర్శనలు, వారి ఉపాధి కోసం అమ్మకాలు నిర్వహించిన ఈ క్రాఫ్ట్ బజారు రేపు ఆదివారం జనవరి 22వ తేదీ తో ముగియనుంది. కాబ్బటి ఇంకా ఎవరైనా దేశ వ్యాప్తంగా ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్,చేనేత,కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు,సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, ఎన్నో స్టాల్స్ లో వేలాది రకాల నాణ్యమైన వస్తువులు,అందుబాటు ధరలలో అందిస్తున్నారు. హోమ్ మెడ్ తినుబండారాలుతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించడానికి ‘చాట్ భండారు’ ఏర్పాటు చేసారు. చేతి వృతులు వారిని, చేనేత కార్మికులను ప్రోత్సహించండి..ఎంట్రీ పీజు లేదు, వాహనాల పార్కింగ్ ఫీజు లేదు..
