సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మెయిన్ రోడ్ లో గల రూపాంతర దేవాలయం ( చర్చ్ ) నిర్మాణం నిమిత్తం శ్రీ అల్లూరి సీతారామరాజు సేవాసమితి అధ్యక్షులు, వైసీపీ నేత నాయకులు గాదిరాజు సుబ్బరాజు రూ 2,00,000/- రెండు లక్షల రూపాయలు విరాళంగా చర్చి నిర్వాహకులకు అందజెయ్యడం జరిగింది, ,జిల్లాలోనే అతి పెద్ద చర్చిగా రూపాంతర దేవాలయాన్ని సుదీర్ఘ కాలంగా నిర్మాణం కొనసాగిస్తున్న విషయం గమనార్హం, ఈకార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ,స్థానిక వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది,
