సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం జగన్ సముఖంలో సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాల ఆమోదాలలో పశ్చిమ గోదావరి జిల్లాకు కీలకమైన 2 శుభవార్తలు వచ్చాయి. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నియోజక వర్గ పరిధిలో ఉన్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చెయ్యడానికి క్యాబినెట్ ఆమోదించింది. గత 10 నెలలు క్రితం సీఎం జగన్ గణపవరం వచ్చినప్పుడు .. ఇక్కడి కి చాలా సమీపంలో భీమవరం రెవెన్యూ డివిజన్ ఉంటె తమను ఏలూరు జిల్లాలో కలపడడం సమంజసం కాదని చేసిన విజ్ఞప్తి ని మన్నించి వారికీ ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబర్ 10వ తేదీన గణపవరం ను భీమవరం రెవెన్యూ డివిజన్ లో కలుపుతామని 30 రోజులలో అభ్యన్తరాలు ఉంటె తెలపాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చిన అధికారిక ప్రకటన కాస్త ఆలస్యంగా నేడు రావడం శుభపరిణామం.. మరో శుభవార్త ఏమిటంటే .. తాడేపల్లి గూడెం ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా క్యాబినెట్ ఆమోదించింది
