సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం రేషన్ నిత్యవసర సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమాన్ని నేడు, ఆదివారం భీమవరం మెంటేవారి తోటలోని రేషన్ షాపులో ఎమ్మెల్యే అంజిబాబు, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ సరుకులను వారు అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతినెల 1 వ తేదీ నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని అన్నారు. 65 సంవత్సరాల దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందిస్తామని, గతంలో ఎండీయూ వాహనం ఎప్పుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్థితి ఉందని, ఈ క్రమంలో రేషన్ కార్డుదారులు వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని అన్నారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించారని, ఈ యాప్ లో డీలర్ వివరాలు ఫోటోలతో సహా వస్తాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
