సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎన్నికల ఫలితాలు తరువాత బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలుభారీ గా పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకే రైతు బజార్ లలో నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందిస్తోంది. ప్రభుత్వం నేటి గురువారం నుండి నుంచి దేశవాళి కందిపప్పు కిలో రూ.160, నాణ్యమైన స్టీమ్ రైస్ (బీపీటీ రకం) కిలో రూ.49, రారైస్ కిలో రూ.48 చొప్పను విక్రయిస్తున్నారు. ఒక్కో వినియోగదారుకు బియ్యం 5 కిలోలు, కంది పప్పు కిలో పంపిణీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో భీమవరం పట్టణంలో గునుపూడి లోని రైతు బజారు లో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు విక్రయించే కౌంటర్ ను ప్రారంభించారు. సూపర్ ఫైన్ రకం బియ్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. నాణ్యతకు సంబంధించి అధికారులతో పాటు నాయకులు కూడా బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర నేత మెంటే పార్ధసారధి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
