సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి విజయవాడ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడడివిజన్‌లో రైల్వేలైన్ల నిర్వహణ నిమిత్తం ఈనెల 30 నుంచి పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఈనెల 30 నుంచి నవంబరు 5వ తేదీ వరకు విజయవాడ-బిట్రగుంట రైలు అప్ అండ్ డౌన్ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈనెల 30 వతేదీ నుంచి నవంబరు 5 వతేదీ వరకు మచిలీపట్నం – విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, నర్సాపూర్-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం రైళ్లను రామవరప్పాడు-విజయవాడ మధ్య రద్దు చేస్తున్నారు. మచిలీపట్నం-భీమవరం, విజయవాడ-నర్సాపురం రైళ్లను విజయవాడ-రామవరప్పాడు మధ్య రద్దు చేస్తారు. ఈనెల 30, 31, నవంబరు 1, 3, 4 తేదీలలో విజయవాడ-విశాఖపట్నం అప్ అండ్ డౌన్ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈనెల 30వ తేదీన ఎర్నాకుళం జంక్షన్-పాట్నా రైలును నవంబరు 4వ తేదీన భావ్‌నగర్-కాకినాడ పోర్ట్ రైలును, నవంబరు 1వ తేదీన, 3వ తేదీన బెంగళూరు- గౌహతి రైలును, ఈనెల 30వ తేదీ నవంబరు 1, 3, 4 తేదీలలో ఛత్రపతి శివాజీ టెర్మిన్‌స-భువనేశ్వర్ రైళ్లను విజయవాడ, గుడివాడ, భీమవరం టెర్మినల్, నిడదవోలుమీదుగా మళ్లిస్తారు.
