సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ నడిబొడ్డున అంబెడ్కర్ సెంటర్ నుండి ఇకపై ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ విజయలక్ష్మి థియేటర్స్ వైపు రోడ్ రైల్వే ట్రాక్ క్రింద నుండి తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కడ లేని విధంగా అద్భుత సాంకేతికత పరిజ్ఞానంతో సుమారు 20 కోట్ల రూపాయలు పైగా వ్యయంతో పూర్తీ ఆధునిక హంగులతో 2వే నిర్మాణం పూర్తీ చేసుకొన్నా రైల్వే అండర్ టర్నల్ బిడ్జి నుండి నేటి ఆదివారం నుండి పూర్తీ స్థాయిలో వాహనాలు రాకపోకలను అనుమతించారు. దీనితో రయ్ రయ్ మంటూ వాహనాలపై ప్రయాణికులు దూసుకొనిపోతున్నారు. ప్రస్తుతం దీనిని ట్రయల్ రన్ గా పరిగణించిన త్వరలో అధికారికంగా అండర్ టర్నల్ బ్రీజ్ ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇకపై టౌన్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఈ రైల్వే గేటు తరుచు పడటం వాహనాలు నిలిచిపోయి అది అంబేద్కర్ సెంటర్ వరకు ఎఫెక్ట్ కావడం ఉండదు. ఇకపై తాడేపల్లి గూడెం వెళ్లి వచ్చే బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు లో కూడా వేగం పెరుగుతుంది.
