సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ‘లయన్సక్లబ్’ జిల్లా 316జి రీజనల్ -2 రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రీజియన్ చైర్ పర్సన్, వివి కృష్ణంరాజు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు,మాజీ జిల్లా గవర్నర్ , ఎం వి ఎస్ రాజు మాట్లాడుతూ.. సమాజ సేవ, నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ అంకితమైందని, లయన్స్ క్లబ్ అనేది ఒక క్లబ్ మాత్రమే కాదని, సమాజ సేవకు అంకితమైన శక్తివంతమైన ఉద్యమన్నారు..లయన్స్ క్లబ్ భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల దిశగానే తొలి అడుగులు వేస్తున్నామని, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో అనేక సమాజహితం కార్యక్రమాలను లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. అనంతరం క్లబ్ పూర్వధ్యక్షులు వబిలిశెట్టి కనకరాజు, ఎస్ కృష్ణంరాజు,కాగిత రమణారావు, కేఎస్ఎన్ రాజు, కంతేటి వెంకటరాజు, అల్లు రామకృష్ణ, గమిని రవిచంద్ర, ఆరవ వి ప్రసాద్, వేగిరాజు విశ్వనాధరాజు, ఎం రంగనాథం, నందమూరి రాజేష్, నడింపల్లి మహేష్ కుమార్, పేరిచర్ల మూర్తిరాజు లను సత్కరించారు.
