సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న బ్రిటిష్ కాలం నాటి లూథరన్ హై స్కూల్ లో ఎందరో ప్రముఖులు చదువుకొని దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో ఉన్న ఘనమైన చరిత్ర ఉంది. ఎందరికో విద్య బుద్దులు నేర్పిన ఈ ఉన్నత పాఠశాలలో తాను చదువుకొన్నపటి తన పూర్వ విద్యార్థులతో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు నేడు ఆదివారం సమావేశం అయ్యి తమ పాత జ్ఞాపకాలను మరోసారి పదిల పరుచుకొని వారితో ఉల్లాసంగా గడిపారు. అప్పటి పాఠాలు బోధించిన గురుదేవులు సన్మానించుకొన్నారు. లూధరన్ హైస్కూల్ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు 1980-1981 10th class బాచ్ లో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మెళనం స్థానిక లూథరన్ హైస్కూల్ బ్యాచ్ గెట్ టుగెదర్ లూథరన్ హైస్కూల్ లో జరిగింది ఈ కార్యక్రమంలో 1980-1981 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ ఆనందంగా గడిపారు
