సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు లోని గాంధీనగర్ లెప్రెసి కాలనీ లో లెప్రసీ వ్యాధిగ్రస్తుల కోసం నిర్మించిన గృహాలు శిథిలావస్థ లో ఉన్నందున వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల వారికి నూతన గృహాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని నేడు, సోమవారం జరిగిన రాష్ట్ర శాసన మండలి సమావేశంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి, జోగి రమేష్ ని కోరటం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి భీమవరం లెప్రెసి కాలనీ లో నూతన గృహాలు మంజూరు చేయుటకు వెంటనే శరవేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
