సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధల ఆదేశాల మేరకు భీమవరం కోర్టుల్లో పెండింగులో వున్న కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో లోక్ అదాలత్( మార్చి నెల 14వ ) శనివారం భీమవరంలో వున్న అన్ని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించారు.ఈ జాతీయ లోక్ అదాలత్ లో 3వ అదనపు జిల్లా కోర్టు మరియు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టుల్లో పెండింగులో వున్న కేసులను సంస్ధ చైర్మన్ మరియు పోక్సో కోర్టు ప్లత్యేక న్యాయమూర్తి Dr.B. లక్ష్మీనారాయణ రాజీ చేసారు. అదే విధంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టుల కేసులు పలువురున్యాయమూర్తిల ఆధ్వర్యంలో రాజి చెయ్యడం జరిగింది.ఈరోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 31 సివిల్ కేసులు, 1221 క్రిమినల్ కేసులు, 35 ఎక్సైజు కేసులు11 BSNL ప్రీ లిటిగేషన్ కేసులు, వెరసి 1298 కేసులు రాజీ చెయ్యడం జరిగింది. . రాజీ చేసిన కేసుల విలువ సుమారు 2 కోట్ల 85 లక్షల రూపాయలు. ఈ కార్యక్రమంలో ,బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యేలేటి యోహాన్ (న్యూటన్), అడపాల ప్రసన్న కుమార్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని కేసుల రాజీకి కృషి చేసారు.
