సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 4 వ వార్డు నర్సయ్య అగ్రాహరంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో బాధిత షేక్ నాగూర్ సాహెబ్ ,చిట్టిబాబు కుటుంబాలు కు నేడు, సోమవారం ఒమిక్స్ లాబొరేటరీస్ సౌజన్యంతో దాతలు సహాయం అందించడం జరిగింది. రంగసాయి మాట్లాడుతూ.. దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ కుటుంబాలను ఉన్నంతలో ఆదుకోవాలని కోరారు.అగ్ని ప్రమాద బాధితులకు వస్తు సామగ్రి, బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమం ,శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో చిరు పవన తేజం సేవ సమితి అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి
కృష్ణ ,భట్టిప్రోలు శ్రీనివాస్ , కె.వీరబాబు,వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *