`సిగ్మాతెలుగు డాట్ ఇన్,: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్ళపై అధికారులు నిఘా పెట్టిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లో అత్యధిక సినిమా హాళ్లు ఉన్న భీమవరం లోని సినిమా ధియేటర్లలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ ఎమ్మార్వో రమణారావు వన్ టౌన్ ఎస్సై అప్పారావు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో భీమవరంలో థియేటర్లను విస్తృత తనిఖీలునిర్వహించారు. దీనిలో ఒక్క మల్టి ఫ్లెక్స్ లో 4 థియేటర్ల మినహా అన్ని థియేటర్స్ లోయజమాన్యం వారి బి ఫారం లైసెన్స్, అధిక టికెట్ రేట్లు, ఇతర నిబంధనల అమలులో లోపాలు గుర్తించిన సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆ సినిమా హాళ్ల మేనేజిమెంట్ ఫై ఆగ్రహం వ్యక్తం `. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం లో నేడు, శుక్రవారం నుండి ఐదు థియేటర్ల లో ఎనిమిది స్క్రీన్స్ లను తాత్కాలికంగా మూసేందుకు ఆదేశాలు జారీ చేశామనీ, సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. కొసమెరుపు ఏమిటంటే.. కోవిద్ నేపథ్యంలో మూసివేసిన అన్నపూర్ణ థియేటర్ అయితే ఇప్పటికే అసలు ఇంకా ప్రదర్శనలు ప్రారంభించలేదు. తాజా పరిణామాలలో.. ప్రస్తుతం భీమవరం మల్టి ఫ్లెక్స్ లో మాత్రమే సినిమా వినోదం అందుబాటులో ఉంది.మిగతా థియేటర్స్ కూడా లోపాలు సవరించుకొని అతిత్వరలోనే ప్రదర్శనలు ప్రారంభించడానికి యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. `

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *