సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు, మంగళవారం భీమవరం లో పలు ప్రవేట్,కార్పొరేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను ఏ ఐ ఎస్ ఎఫ్ , టి యన్ ఎస్ ఎఫ్ నాయకులు మూయించివేసారు. విద్యా రంగాన్ని పరిరక్షించే విషయం లో జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని దీనికి నిదర్శనం సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు లేవని, జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు అక్కడకడా కూలడానికి సిద్దం గా ఉన్నాయని, వాటికి సొంత భావనాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని వారు కోరారు . అమ్మ ఒడి డబ్బులు చాలా మందికి ఇంకా అకౌంట్సు లో పడలేదని అమ్మ ఒడి డబ్బులు కుటుంబం లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు, వసతి దీవెన , విద్యా దీవెన డబ్బులు చాలా మంది విద్యార్థులకు బకాలు ఉన్నాయని వీటిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను రానున్న రోజులలో పరిష్కరించ లేని పక్షంలో పోరు ఉదృతం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి , టి యన్ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాండ్రు సందీప్ లు యు.మురళి , యం.అనీల్, తదితరులు పాల్గొన్నారు.
