సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు లో ఛాంబర్ అఫ్ కామర్స్ బిల్డింగ్ వైపు .. గుండు కాంప్లెక్ కు వెళ్లే దారిలో… టైలర్స్ ఎక్కువ ఉండే ఏరియాలో సుదీర్ఘ కాలంగా అందరికి సుపరిచితమైన ‘వాణి’ టైలర్స్ షాప్ నిర్వహిస్తున్న టైలర్ అప్పారావు అనే సుమారు 70 ఏళ్ళ వృద్దుడు ఆత్మహత్య విఫలయత్నం చేసి రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో పడి ఉండటం గమనార్హం. నేటి ఆదివారం ఉదయం టైలరింగ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చిన మహిళ అతనిని హృదయవిదారక పరిస్థితిలో చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం తో పోలీసులు రంగంలోకి దిగి అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం టైలర్ అప్పారావు స్థానిక 23 వార్డు బడుగువారి వీధి లో నివాసం ఉంటున్నారు. చాల కాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. పోలీస్ విచారణలో అసలు పూర్తీ వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
