సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణం లెప్రసీ కాలనీ లో నేడు, బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు మరియు స్థానిక శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. సీఎం జగన్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగము చేసుకోవాలని, పిలుపునిచ్చారు. వైసిపి అభిమానులు, ప్రజలు విశేషంగా హాజరయిన ఈ కార్యక్రమం ఉత్సహపూరిత వాతావరణంలో జరిగింది.
