సిగ్మా తెలుగు డాట్ ఇన్: భీమవరం పట్టణంలో ప్రజలకు గత దశాబ్ద కాలంగా ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ మరోసారి కొత్త ఏడాది, పండుగల కోలాహలంతో స్థానిక ప్రగతి గ్రౌండ్,పద్మాలయ థియేటర్ ఎదురుగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్,చేనేత,కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు,సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, వెదురు ఫర్నిచర్, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, వస్త్రాలు దాదాపు ఐభై స్టాల్స్ పైగా భారీ ఎత్తున ఏర్పాటు చెయ్యడం జరిగింది. హోమ్ మెడ్ తినుబండారాలుతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించడానికి ‘చాట్ భండారు’ ఏర్పాటు చేసారు. ఎంట్రీ పీజు లేదు, వాహనాల పార్కింగ్ ఫీజు లేదు.. వేలాది రకాల నాణ్యమైన వస్తువులు, డిజెన్ దుస్తులు తయారు చేసిన దేశీయ కళాకారుల టాలెంట్ ను వీక్షించడమే కాదు. అవసరమైన మేరకు వాటిని కొనుగోలు చేసి వారికీ ప్రోత్సహించడం..మన ఆరోగ్యం పెంచుకోవడం.`చేతి వృతి కళాకారులకు పని, ఆదాయం కలిపించగలగడం.. ఈ పండుగలవేళల మనకు అదనపు సంతృప్తి.. కాదంటారా?
