సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, మంగళవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతం అయ్యి ఉరుములు తో దద్దరిల్లుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి ఒక్కసారిగా భారీ కుంభ వృష్టి ఉరుములు పిడుగులా శబ్దాలతో కురవడం మొదలయింది. గత 4 రోజులుగా కాస్త వాతావరణం చల్లబడి చిన్న తుంపర జల్లులు కురిసినప్పటికీ నేడు కురిసిన భారీ వర్షం మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటలపాటు ఏకబిగిగా కురవడంతో భూమి వాతావరణం పూర్తిగా చల్లబడి ప్రజలకు ఆహ్లదం కలిగింది. నియోజక పరిధిలో పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలచిపోయింది.లోతట్టు ప్రాంతాల తో పాటు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *