సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం , భీమవరం లో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్ర పోరాటం వీరోచితంగా చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు. తదుపరి స్థానిక SRKR కళాశాల 43వ వార్షికోత్సవాలలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ముందుగా జాతీయ స్థాయిలో విద్యాసంస్థగా పేరుగడించిన సాగిరాజు రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని, సాగిరాజు ప్రసాదరాజు వారి సిబ్బంది కృషిని అభినందిస్తూ , సభకు హాజరైన విష్ణు విద్యాసంస్థల చైర్మెన్ విష్ణు రాజు ను కూడా అభినందించారు. విద్యార్థిని, విద్యార్థులు భారతీయత ను అలవరచుకోవాలి అని, గ్రామాల పట్టణాల అంతరాన్ని తగ్గించేలా గ్రామాలలో అన్ని సౌకర్యాల ఏర్పాటు కు కృషి చేయలని మాతృ భాషను ప్రేమించాలని, కులమత ఘర్షణకు దూరంగా ఉండాలని, మన సంపద సంతోషం కలిగించేలా ఉండాలని, ఆలా అని అవినీతి పరులు కాకుండదని, పెద్దలను గౌరవించడం , సాటివారికి నమస్కారం చెప్పడం వంటి మన భారతీయ సంస్కృతీ , యోగ అలవరచు కొంటె చాలు దేశానికీ ప్రయోజకుడుగా మారతారని.. అల్లూరి సీతారామ రాజు ది గ్రేట్ హీరో వంటి చరిత్ర లు చదవాలని, వస్త్రధారణ తినే ఆహారంలోను భారతీయత కనిపిస్తే విదేశాలలో గౌరవం పొందవచ్చునని తనదయిన యాస బాషా ప్రయోగాలతో విద్యార్థులకు స్ఫూర్తి దాయక ప్రసంగం చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు విష్ణు కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు భీమవరం రైల్వే స్టేషన్‌కు చేరుకుని 5:15 గంటలకు ట్రైన్‌లో బయలుదేరి రాత్రి 7:30కు ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్టుకు చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *