సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో పద్మాలయ థియేటర్స్ ఎదురుగ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ‘రాయల్ క్రాఫ్ట్ బజారు’ ను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. వివిధ స్టాల్స్ ను సందర్శించి చేనేత వస్త్రాలు, కొయ్యబొమ్మలు, ఇంటి అలంకరణ సామాగ్రి, లేసు పనితనం పరిశీలించి కళాకారుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎందరో చేతి వృతి కళాకారులు సమిష్టి కృషితో ఏర్పాటు చేసిన ఈ ఎక్సిబిషన్ విజయవంతం కావాలని, వారికీ స్థానిక ప్రజలు నుండి ఈ పండుగల వేళా తగిన ప్రోత్సహం ఉంటుందని, నాణ్యమైన వస్తువులు , సరసమైన ధరలకు అమ్మకాలు నిర్వహించాలని కోరుతూ నిర్వాహకులు వెంకట రెడ్డి తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నేతలు కూడా పాల్గొన్నారు.
